రాయికల్
అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం

viswatelangana.com
March 9th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాయికల్ శాఖ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు గుర్రం రత్నాకర్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత మహిళా హక్కుల ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చేప్పుల దండేసి జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం నాగునూరు గ్రామంలో అవమానించి యావత్ దళిత జాతి మనోభావాలను మానసికంగా దెబ్బతీసిన దుండగులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెలిమెలల మల్లేశం, లింగంపల్లి రాజేష్, బన్న సంజీవ్ మహమ్మద్ ఇంతియాజ్, ఆకు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.



