కోరుట్ల
హైకోర్టు పోర్టు పోలియో జడ్జిని కలిసిన కోరుట్ల బార్ అసోసియేషన్

viswatelangana.com
October 1st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు తన్నీరు శ్రీనివాసరావు, జనరల్ సెక్రెటరీ సుతారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో హైకోర్టు పోర్టు పోలియో జడ్జి తుకారంని కలిసి కోరుట్లలో నూతనంగా నిర్మిస్తున్న భవనంలో అదనపు జెఎంఎఫ్సి కోర్టు అలాగే అదనపు జిల్లా కోర్టు ను ఏర్పాటు చేయాలని కోరారు. దానికి కోరుట్ల కోర్టులో పెండేన్సీ ఎక్కువ ఉండడం వలన అదనపు జెఎంఎఫ్సి కోర్టుని ఇవ్వడానికి హామీ ఇచ్చారు. అదనపు జిల్లా కోర్టు కోసం సానుకూలంగా స్పందించారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవనాన్ని తొందరగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ తోట ఆంజనేయులు, కోశాధికారి చిలువేరి రాజశేఖర్, సీనియర్ ఈసీ మెంబర్ కస్తూరి రమేష్, జూనియర్ ఈసీ అనసోద్దిన్, అడ్వకేట్లు పాల్గొన్నారు.



