కోరుట్ల
చెట్లు పర్యావరణ పరిరక్షణ మిత్రులు

viswatelangana.com
June 28th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల సిరిసిల్ల జిల్లాల రీజినల్ లెవెల్ కోఆర్డినేటర్ డాక్టర్ దాసరి రాజేందర్ కోరుట్లలోని తెలంగాణ మైనారిటీ గురుకులంలో పాఠశాల ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు . దీనిలో భాగంగా విద్యార్థులు పాఠశాలలో పూల మొక్కలు,పండ్ల మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల రీజినల్ లెవెల్ కోఆర్డినేటర్ డాక్టర్ దాసరి రాజేందర్ విద్యార్థులతో మాట్లాడుతూ చెట్లవలన కాలుష్య రహితంగా మారడం,వాటి ఆవశ్యకతను గూర్చి మాట్లాడారు.ఆర్ ఎల్ సి తో పాటు ప్రిన్సిపాల్ శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



