కథలాపూర్
సూరమ్మ ప్రాజెక్టు పూర్తి చెయ్యాలి
అసెంబ్లీ లో ప్రస్తావించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
viswatelangana.com
February 15th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు సాగు నీరందించే సూరమ్మ రిజర్వాయర్ పనులను పూర్తి చేయాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. రాళ్లవాగు ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లాలో ఉండగా.. కాలువలు జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్నాయని, మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి ఎత్తిపోతలు నీళ్లు వచ్చేలా కాలువ పనులకు నిధులు మంజూరు చేయాలని విన్నవిం చారు. సూరమ్మ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాలువలు పూర్తి చేస్తే కథలాపూర్, మేడి పెల్లి, బీమారం మండలాల్లో 45 వేల ఎకరాలకు నీరందుతుందన్నారు



