కొడిమ్యాల
రైతునేస్తం కార్యక్రమాన్ని రైతులు ఉపయోగించుకోవాలి -మండల వ్యవసాయ అధికారి పి. జ్యోతి

viswatelangana.com
October 22nd, 2024
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
ప్రతి మంగళవారం రైతువేదికల్లో నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమం వీడియో కాన్ఫారెన్స్ జరిగింది. వరి పంటలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు, సస్య రక్షణ చర్యల గురించి, వరి ధాన్యం కొనుగోలులో తీసుకోవాల్సిన నాణ్యత ప్రమాణాల గురించి మరియు ప్రత్తి తీసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాస్త్రవేత్తలు వివరించడం జరిగినది. వరి పంట విత్తనోత్పత్తికి సంబంధించి ఇతర సందేహాలను శాస్త్రవేత్తలతో వెల్మల రామిరెడ్డి రైతు అడిగి తెలుసుకున్నారు. ప్రతి మంగళవారం జరిగే రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు తమకున్న సందేహాలను నేరుగా శాస్త్రవేత్తలతో అడిగి తెలుసుకునే అవకాశం కలదు. ఈ కార్యక్రమం లో ఏఈఓలు జి. గ్రీష్మ, వి.మంజుల, కె.ప్రశాంత్ మరియు రైతులు పాల్గొన్నారు.



