కథలాపూర్
ఛలో అసెంబ్లీ ముట్టడి

viswatelangana.com
March 21st, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో రైతు ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ మార్చి 24 వ తేదీ సోమవారం రోజు అసెంబ్లీ ముట్టడి కి రైతులందరు తరలి వచ్చి ఇట్టి కార్యక్రమం విజయవంతం చేసి ప్రభుత్వం దిగివచ్చేలా చేసి మన కు ఇచ్చిన హామీలు సాదించుకుందాం అని,ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని,రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని,అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి, ఋణ మాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయాలి,అర్హులైన రైతు కూలీలకు 15000 రూపాయలు నిధులు విడుదల చేయాలని అన్నారు.ఈ కార్యక్రమం లో రైతు ఐక్య వేదిక జగిత్యాల జిల్లా నాయకులు బద్దం మహేందర్ రెడ్డి, పురుకుటపు గంగారెడ్డి, పుండ్ర జనార్దన్, గడ్డం రాజారెడ్డి, సూరనేని వినోద్ రావు, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.



