జగిత్యాలలో ప్రజావాణి రద్దుతెలంగాణ అవతరణ వేడుకల నేపథ్యంలో కలెక్టర్ ప్రకటన

viswatelangana.com
జగిత్యాల జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈసారి రద్దు చేస్తున్నట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సోమవారం (జూన్ 2, 2025) రోజున కలెక్టరేట్‌లో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల నిర్వహణ కారణంగా ఈసారి రద్దు చేయడం జరిగినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు, జిల్లా స్థాయిలో వివిధ కార్యక్రమాలను నిర్వహించాల్సిన బాధ్యత ఉన్నందున ప్రజావాణిని రద్దు చేయవలసి వచ్చిందని వివరించారు. ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్ కార్యాలయానికి రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అలాగే, అవసరమైన దరఖాస్తులు తదితర అంశాలపై సంబంధిత శాఖలతో సంప్రదించి తదుపరి తేదీలో వినతులు సమర్పించవచ్చని అధికార వర్గాలు తెలిపారు. తదుపరి ప్రజావాణి కార్యక్రమం ఎప్పుడు నిర్వహిస్తారన్నదిపై అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు.



