viswatelangana.com
Date of Publish : 18 February 2024, 2:22 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
జగిత్యాలలో బాక్సింగ్ జిల్లా స్థాయి పోటీలు
featured

జగిత్యాల జిల్లా స్థాయి బాక్సింగ్ సబ్ జూనియర్ బాలురు, బాలికలు పోటీలు 19-02-2024 రోజున జగిత్యాల జిల్లా మినీ స్టేడియంలో జరుగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. తేదీ 01-01-2010 నుండి 31-12-2011 సంవత్సరం మద్య లో జన్మించిన వారు ఈ పోటీలకు అర్హులని, పోటీల్లో పాల్గొనువారు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ రెండు ఫొటోలు తీసుకొని రావాలని సూచించారు.ఈ పోటీలలో విజేతలు సికిoద్రాబాద్ లోని లాలా గూడ రైల్వే ఇన్స్టిట్యూట్ లో జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలలో పాల్గొంటారు. ఆసక్తి కలవారు సమాచారం కోసం ఈ నెంబర్ కు 9441773080 సంప్రదించగలరని జగిత్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేందర్, కార్యదర్శి గువ్వ శ్రీనివాస్ తెలిపారు.

Change News Type