జగిత్యాల ఆర్టిసి లాజిస్టిక్ కొరియర్ సేవా విభాగంలో శ్రమదోపిడి
జగిత్యాల ఆర్టిసి లాజిస్టిక్ కొరియర్ సేవా విభాగంలో శ్రమదోపిడి

viswatelangana.com
జగిత్యాల పట్టణంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా (ఆర్ టి సి)సంస్థ కు, అనుబంధంగా కొత్త బస్టాండ్ లో గల తెలంగాణ రాష్ర్ట లాజిటిక్స్, కొరియర్ సేవలు అందించే విభాగం కలదు. దీనిలో డి ఎం ఇ ( డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్)గా బాధ్యతలు నిర్వహిస్తున్న వేణు అనే ఉద్యోగి, కొరియర్ సర్వీసెస్ ప్రజలకు అందించడానికి గాను తన వద్దనున్న సిబ్బంది సరిపోదని, తనకు తెలిసిన చంద్రశేఖర్ అనే ఓ వ్యక్తిని, అనధికారికంగా గత సంవత్సరం అక్టోబర్ లో నియమించుకుని, అతనితో కొరియర్ సేవలు చేయిస్తున్నాడు. నెల ముగిసేసరికి, డి ఎం ఇ వేణు ను తనకు ఇవ్వాల్సిన నెలవారి జీతం గురించి అడగగా, ఉన్నతాధికారుల దృష్టికి నీవు పని చేస్తున్నట్లుగా తెలిపినప్పటికీ, ఇంకా వారి నుంచి ఎలాంటి బదులు రాలేదని , నీ ఉద్యోగానికి ఎలాంటి సమస్య లేదు, ఇలాగే ఉద్యోగం కొనసాగించాలని డి ఎం ఇ వేణు కోరాడు. చంద్రశేఖర్ తన విధులను యధావిధిగా కొనసాగించాడు. నెల ఆద్యంతం తన నెలవారి జీతం ఇవ్వాలని చర్చించే సందర్భంలో, నీకు ఎలాంటి డోకా లేదు ఖచ్చితంగా నీ జీతం నీకు ఇస్తారని, పై అధికారులకు నీవు ఇక్కడ పనిచేస్తున్నట్లుగా లేఖలు రాశానని, ఇలాంటి అవకాశం నిన్ను వెతుక్కుంటూ మరల రాదని, డి ఎం ఈ వేణు సర్ది చెప్పాడు. నెలలు గడిచినా జీతం ఇవ్వకపోవడంతో చంద్రశేఖర్ కు రవాణా ఖర్చులకు, ఇంటి ఖర్చులకు ఇబ్బంది అవడంతో, పదేపదే డి ఎం ఇ.వేణును అడగడంతో, నేను పలు మార్లు పై అధికారులకు నీవు పనిచేస్తున్న విషయం, లేఖ ద్వారా తెలియజేస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలపడంతో, విషయం గ్రహించిన చంద్రశేఖర్ నేరుగా డిపో మేనేజర్ ను కలిసి, తను పనిచేస్తున్న విషయాన్ని తన వద్ద ఉన్న ఆధారాలను, రోస్టర్లను జతచేస్తు వ్రాతపూర్వకంగా ఓ ఫిర్యాదు చేసి, తనకు జీతం ఇప్పించాలని, నిర్లక్ష్యం చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరాడు.
డిపో మేనేజర్ జగిత్యాల.
ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న చంద్రశేఖర్ జగిత్యాల కొత్త బస్టాండ్ లో గల ఆర్టీసీకి, అనుబంధంగా ఉన్న కొరియర్ సేవలు అందించే విభాగంలో, గత కొన్ని నెలలుగా పనిచేస్తున్నప్పటికిని, జీతం ఇవ్వడం లేదని ఫిర్యాదు అందగానే విచారణకు ఆదేశించాను. విచారణలో భాగంగా ఫిర్యాదుదారుడు పనిచేసినట్లు రుజువైతే, తన జీతాన్ని ఇప్పిస్తూ, నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ జాప్యం చేసిన వారిపై శాఖ పరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం.
నిఘా నేత్రాలను అమర్చడంలో నిర్లక్ష్యం.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే ఆర్టీసీ కి అనుబంధంగా ఉన్న, లాజిస్టిక్స్ కొరియర్ సేవలు కొనసాగించు గదులలో మరియు వస్తువులు నిల్వ ఉండే గదుల ఆరుబయట, ఏలాంటి సి సి కెమెరాలు లేకపోవడం ఆశ్చర్యానికి, నిర్లక్ష్యానికి తావిస్తోంది. ప్రజలు విలువైన వస్తువులను, విలువైన డాక్యుమెంట్లను కొరియర్ చేస్తారు. అలాంటి వస్తువులు దొంగిలించబడితే, కనీసం దొంగలను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు అమర్చకపోవడం, వారి నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం కనబడుతుంది. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి, సీసీ కెమెరాలు అమర్చాలని ప్రజలు, వినియోగదారులు కోరుతున్నారు.



