జగిత్యాల ఆర్టీవో కార్యాలయంలో అడ్డగోలుగా దోపిడీ

viswatelangana.com
ష్టానిక జగిత్యాల జిల్లా తాటిపెళ్లి లో గల ఆర్టీఓ కార్యాలయం లో డబ్బులు తడపందే పని అయ్యేట్లు లేని చందంగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఏజెంట్లు లేని ఆర్టీఓ కార్యాలయ నిర్వహణకై పార దర్శకత ప్రదర్శిస్తూ మీ సేవ యాప్ ని ఆండ్రాయిడ్ మొబైల్ కు వాడుకలోకి తెచ్చింది. గతంలో టి యాప్ పోలియో అనే ఆప్ ,కాలాను గమనంగా తెలంగాణ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మీ సేవగా రూపాంతరం చెంది అందుబాటులోకి వచ్చింది. ఇందులో పలు రకాల సేవలను కార్యాలయాలను సందర్శించకుండానే సెల్ఫీ ఫోటోలతో పలు రకాల సర్టిఫికెట్లు డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత కార్యకలాపాలు చేసుకునే సదుపాయం కలదు. ఇందులో భాగంగా ఓ వ్యక్తి మీసేవ మొబైల్ ఆప్ ని ఉపయోగించి తనకున్న డ్రైవింగ్ లైసెన్సును రెన్యువల్ చేయడానికి జనవరి నెలలో 25 తారీఖు న దరఖాస్తు చేసుకోగా సుమారు వారం రోజులు గడిచినప్పటికిని తన దరఖాస్తును ఆమోదించకపోవడంతో ప్రజావాణిలో ఫిర్యాదు చేసుకున్నాడు. సదరు వ్యక్తి తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ను ఆన్లైన్లో నిర్ణీత సమయంలో ఆమోదించకపోవడంపై ఆర్ టి ఓ కార్యాలయ సిబ్బంది ఏజెంట్లను పోషిస్తున్నారని, దరఖాస్తుదారులు నేరుగా ఆర్టిఓ కార్యాలయాన్ని సందర్శిస్తే అక్కడ ఉన్న సిబ్బందికి ఏజెంట్ల ద్వారా డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుందని, ఆర్టీవో కార్యాలయాన్ని సందర్శించకుండా నేరుగా ఆన్లైన్లో రెన్యువల్ చేసుకుంటే సిబ్బందికి ఒరిగేది ఏమీ ఉండదని మండిపడ్డారు.



