కోరుట్ల
అయ్యప్ప స్వామి దేవాలయంలో వసంత పంచమి వేడుకలు
viswatelangana.com
February 14th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల ప్రతినిధి: వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని మన జ్ఞాన సరస్వతీ దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ పాలెపు రాముశర్మ వినయ్ శర్మ వైదిక నిర్వహణలో ప్రధాన కలశ పూజ, నవగ్రహ పూజా శ్రీ సరస్వతీ మాత మూల విరాట్టుకు పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో 121 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. విచ్చేసిన విద్యార్థులకు పుస్తక పూజ, విజయ కంకణధారణ, పెన్నులు వితరణ చేశారు భక్తులు, విద్యార్థులు పులిహోర ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలోఅంబటి శ్రీనివాస్ గురుస్వామి అధ్యక్షులు, శ్రీ అయ్యప్ప జ్ఞాన సరస్వతీ, శనైశ్చర దేవాలయం అయ్యప్ప స్వామి దేవాలయం కార్యకర్త లు తదితరులు పాల్గొన్నారు



