రాయికల్
జనసేన అధినేత జన్మదిన వేడుకలు

viswatelangana.com
September 2nd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జనహృదయనేత, జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా.. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం ఇందిరానగర్ కాలనీకి చెందిన మారంపెల్లి రాజశేఖర్ ఆధ్వర్యంలో, నివేదిత వృద్ధాశ్రమంలో, వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వృద్ధులకు పండ్లు, ఫలాలు, బ్రెడ్ ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో లింగంపెల్లి సిద్ధార్థ, నిగ విజయ్, మారంపెల్లి అరుణ్, పెద్దిరెడ్డి తరుణ్ తదితరులు పాల్గొన్నారు.



