రాయికల్

ప్రపంచ అటవీ దినోత్సవం

viswatelangana.com

March 21st, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని అల్లీపూర్ ఫారెస్ట్ లోప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా గ్రామంలోని రైతులకు శ్రీ వాణి ఈ టెక్నో స్కూల్ పిల్లలకు అడవులు వాటి పరిరక్షణ గూర్చి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జగిత్యాల రేంజ్ ఆఫీసర్ ప్రణీత్ కౌర్ మాట్లాడుతూఅడవులను పెంచడం వల్ల భావితరాలకు పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళమవుతామని స్వచ్ఛమైన గాలి అందించవచ్చని వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వర్షాలు కురవడం వల్ల కెమికల్స్ వాడకుండానే పంటలు సమృద్ధిగా పండుతాయి అని అడవి నరికినట్లైతే అటవీశాఖ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు అడవులు సమృద్ధిగా ఉన్నట్లయితే కోతులు ఊరిలోకి రావని కోతుల బెడద నుండి జనానికి రైతులకు వారి పంట పొలాలకు ఇబ్బంది ఉండదని అటవీ జంతువులు స్వేచ్చ గా జీవించే అవకాశం ఉంటుందని అన్నారు రైతులు వారి పొలం గట్లపై బీడు భూముల్లో చెట్లను పెంచుకోవడం వల్ల అదనపు ఆదాయం సమకూరుతుందని ప్రతి ఒక్కరు ఇంటిలో పండ్ల మొక్కలు పూల మొక్కలు నాటుకోవాలని పండ్ల మొక్కలు నాటుకోవడం వల్ల స్వచ్ఛమైన పండ్లు లభిస్తాయని వాటిని తినడం వల్ల ఆరోగ్యంగా అంటే అవకాశం ఉంటుందని పూల మొక్కలు నాటుకోవడం వల్ల ఇంటిలోని పూజా కార్యక్రమాలకు ఎ లాంటి డబ్బులు అవసరం లేకుండా స్వచ్ఛమైన పూలు వాడుకోవచ్చని అన్నారు అనంతరం అడవుల వల్ల లాభాల గూర్చి మాట్లాడిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ లు రవికుమార్, అరుణ్ కుమార్, ఎఫ్ ఎస్ ఓ హమీద్, ఎఫ్ బి ఓ నరేష్, అటవీశాఖ సిబ్బంది గ్రామస్తులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button