కోరుట్ల

కోరుట్ల పట్టణంలో ఘనంగా పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక నిర్వహణ

viswatelangana.com

June 29th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి వధూవరుల పరిచయ వేదికను పద్మశాలి కళ్యాణ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని సంఘ అధ్యక్షులు శ్రీ గుంటుక ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బొమ్మకంటి తిరుపతి తన 50వ పరిచయ వేదికగా ఆదివారం రోజున కోరుట్లలో నిర్వహించగా పట్టణ, వివిధ గ్రామాల మరియు మండలాల నుండి 150 మంది అమ్మాయిలు అబ్బాయిలు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో టి.ఆర్.పి.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, జగిత్యాల జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, టి.ఆర్.పి.ఎస్ కార్యదర్శి జిల్లా ధనుంజయ్, తాజా మాజీ కౌన్సిలర్లు ఎంభేరి నాగభూషణం, జిందం లక్ష్మీనారాయణ, ఆడెపు మధు, గడ్డం మధు, జిల్లా దీపారాణి, మచ్చ కవిత, పి.ఓ.పి.ఏ అధ్యక్షులు అందె శివప్రసాద్, ఎమ్.ఇ.ఓ గంగుల నరేషo, పిన్నంశెట్టి భానుమూర్తి, గడ్డం రాజేంద్ర ప్రసాద్, చెన్న విశ్వనాథం, జగదీశ్వర్, రేగుంట అశోక్, రేగుంట రాజేంద్రప్రసాద్, ఆడెపు నరేష్, రాయికల్ పట్టణ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, రాయికల్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి మామిడాల లక్ష్మీనారాయణ, కోరుట్ల పద్మశాలి సంఘ ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, సహాయ కార్యదర్శి గోసికొండ కుమారస్వామి, కోశాధికారి అందె రాజ్ కుమార్, కార్యవర్గ సభ్యులు ఎక్కలదేవి రాంచందర్, నల్ల ప్రశాంత్, పడాల గణేష్, యువత ఉపాధ్యక్షులు బండి సురేష్, ప్రధాన కార్యదర్శి చింతకింది ప్రేమ్, సహాయ కార్యదర్శి రాడం మహేందర్, కార్యవర్గ సభ్యులు బైరి ఆనంద్, భీమనాతి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button