రాయికల్

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

viswatelangana.com

December 7th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, వెలమ కులాన్ని కించపరుస్తూ నాన రకాలుగా దూషించడంతో, శనివారం రోజున జగిత్యాల జిల్లా రాయికల్ మండల వెలమ సంఘం కోశాధికారి దుగ్యాల రమాపతి రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్, చేసిన వ్యాఖ్యలకు రాయికల్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే శంకర్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామని అన్నారు. ఈ సందర్భంగా వెలమ కులాన్ని దూషించిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ తక్షణమే క్షమాపణ చెప్పి, తన పదవికి రాజీనామా చేయాలని లేనియెడల వెలమ కులస్తుల నుండి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాయికల్ పట్టణ మండల వెలమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఇందులో సంఘం సభ్యులు జకీలేటి హరీష్ రావు, సంతోష్ రావు, రవీందర్ రావు,రాజశేఖర్ రావు, సతీష్ రావు, యాచమనేని శ్రీనివాస్ రావు, సాగర్ రావు, లక్ష్మణరావు, రత్నాకర్ రావు, వేణు రావు, జీవన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button