కొడిమ్యాల

నాచుపల్లి జేఎన్టీయూ నీట్ పరీక్షఇన్విజిలేటర్లకు శిక్షణ

viswatelangana.com

May 3rd, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ కొండగట్టు పరిధిలో నిర్వహించే నీట్ 2025 పరీక్షల విధులలో పాల్గొని ఇన్విజిలేటర్లకు శనివారం రోజున శిక్షణ ఇన్విజిలేటర్లు 9 గంటల 30 నిమిషాలకు రిపోర్ట్ చేయాలని, ఐడి కార్డులు ధరించాలని, నీట్ పరీక్ష రాసే విద్యార్థులను ఉదయం 11 గంటల నుండి సెంటర్లోకి అనుమతి ఇస్తారని,1. 30 నిమిషాల తర్వాత అనుమతి ఉండదని , పరీక్ష రాసే విద్యార్థులు ఎటువంటి సెల్ఫోన్లు, పెన్నులు తే రాదని ,ప్రభుత్వం ఇచ్చే బ్లాక్ పెన్నులను వాడాలని అన్నారు. రెండు గంటల నుండి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని ఈ సందర్భంగా ఇన్విజిరేటర్లకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ కళాశాల ప్రిన్సిపాల్ డా. ప్రభాకర్, చీఫ్ సూపరిo డెంట్లు జగదీశ్వర్, శ్రీపాద సురేష్, అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు, జేఎన్టీయూ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Back to top button