కోరుట్ల
జిల్లా ఇంచార్జ్ మంత్రిని కలిసిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com
August 2nd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి కెప్టెన్ ఉత్తం కుమార్ రెడ్డితో రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు శుక్రవారం హైదరాబాదులో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చం అందజేసి నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పత్రికల వారితో కృష్ణారావు మాట్లాడుతూ. కోరుట్ల నియోజకవర్గ సమస్యల పరిష్కారం విషయంలో మంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు. జువ్వాడి కృష్ణారావు తో పాటు కోరుట్ల నియోజకవర్గం యువజన కాంగ్రెస్ నాయకుడు ఎలేటి మహిపాల్ రెడ్డి ఉన్నారు.



