జిల్లా డాక్టర్ మాత శిశు సంరక్షణ అధికారి సందర్శన

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మాత శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ జయపాల్ రెడ్డి, సందర్శించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ఈరువైయి మంది గర్భిణీ స్త్రీలను పరీక్షించి ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ జైపాల్ రెడ్డి, మాట్లాడుతూ గర్భవతులు అందరూ కూడా పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకుంటూ, వైద్యాధికారుల సలహా మేరకు మందులు వాడుకోవాలని అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు చేయించుకోవాలని తెలిపారు. మాత శిశు ఆసుపత్రి యందు నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యతని ఇస్తారు, వైద్యులు అందుబాటులో ఉండి డెలివరీలను చేస్తారు కాబట్టి అందరూ కూడా మాత శశికి వచ్చి డెలివరీలు చేయించుకోగలరని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మాత శిశు సంరక్షణ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జైపాల్ రెడ్డి, మండలవైద్యాధికారులు డాక్టర్నరేష్, డాక్టర్ పరమేశ్వరి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజశేఖర్, సూపర్వైజర్ శ్యామ్, సిబ్బంది పాల్గొన్నారు.



