viswatelangana.com
Date of Publish : 01 October 2024, 4:41 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కథలాపూర్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలు

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మంగళవారం తొలివిడత బతుకమ్మ, దసరా వేడుకలు నిర్వహించారు. విద్యార్థిని,విద్యార్థులు వివిధ రకాల పూలను సేకరించి బతుకమ్మలను తయారు చేసి బతుకమ్మ ఆటలు ఆడారు. విద్యార్థినిలతో పాటు అధ్యాపకులు అందరూ కలిసి ఆటలాడారు. ఆ తర్వాత స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అర్జున్, ఉపాధ్యాయులు శశిధర్, వెంకటేశం, ధరందీప్, ఏడుకొండలు, అశోక్, రవీంధర్, సుమన్, నీలిమ, లక్ష్మీ, రాజ్యలక్ష్మి, ఉమ, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Change News Type