నిబంధనలు అతిక్రమించి ఎరువుల విక్రయాలు జరిపితే వారిపై చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి హెచ్చరించారు

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని వివిధ దుకాణాలను తనిఖీలు చేసిన వ్యవసాయ అధికారి ముక్తేశ్వర్ అందులో భాగంగా విక్రయ కేంద్రాల యజమానులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏవో ముక్తేశ్వర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దుకాణాలలోస్టాక్ బోర్డు ఏర్పాటు చేసి ఎరువుల క్రయ విక్రయాల వివరాలు నమోదు చేయాలన్నారు. లైసెన్స్ కాఫీలని విక్రయ కేంద్రాలలో ప్రదర్శనగా గోడకు అమర్చాలని, విక్రయించే ఎరువులకు సంబందించిన “ఓ “ఫామ్ లను తమ లైసెన్స్ లో నమోదు చేసుకోవాలని ఆమే సూచించారు. ధరల పట్టిక ప్రతి రైతుకి కనిపించే విధంగా అమర్చడంతో పాటు ప్రతి రోజు ఎరువుల నిల్వలను, రోజు వారి అమ్మకాలను రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. ఎమ్మార్పీ ధరలకు మించి ఎరువులను అమ్మరాదని, రైతులకు కొనుగోలు రశీదు ఫామ్ ఎం రూపకంగా ఇవ్వాలని, ఎరువుల అమ్మకాలను ఈ పాస్, బయో మెట్రిక్ పద్ధతిన విక్రయాలు జరపాలని ఏవో ముక్తేశ్వర్ దుకాణాధారులకు సూచించారు.



