viswatelangana.com
Date of Publish : 15 May 2024, 4:31 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కథలాపూర్ పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జగిత్యాల జిల్లా కథలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన 2008-2009 కి సంబంధించిన పూర్వవిద్యార్థులు ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ఆహ్వానించిన దుంపేట, దులూరు, పోసానిపేట, కథలాపూర్ కి చెందిన పూర్వ విద్యార్థులు 15 సంవత్సరాల తరువాత అందరూ కలువడం ఎంతో సంతోషం వ్యక్తం పార్చుకున్నారు. ఆనాడు చదువుకున్న సమయంలో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకొని చదువు చెప్పిన గురువులను మరువకుండా వారి జ్ఞాపకాలను యాదిలో పెట్టుకొని ఎంతో సంస్కారాన్ని నేర్పారని వారి ప్రేరణ మాకు ఎప్పుడు ఉంటుందని పూర్వ విద్యార్థులు మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు అంతయ్య, రుద్ర సుధాకర్, నల్ల శంకర్, వెంకటరాజం, మల్లేశం, ప్రసాద్, మనోహర చారి, శ్రీధర్, రామ్, లక్ష్మణ్ నాయక్ మరియు విద్యార్థులు పడాల గంగాధర్, దినేష్, సాయి కృష్ణ , గోవర్ధన్, వెంకటేష్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

Change News Type