కోరుట్ల
జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల తల్లితండ్రులకు కమిటీ సమావేశం

viswatelangana.com
October 19th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యార్థుల తల్లితండ్రులకు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గుగ్గిళ్ళ సురేష్ గౌడ్ పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్య నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారించాలన్నారు. అనంతరం పాఠశాలలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ఇటీవల జరిగిన ఎస్జిఎఫ్ క్రీడలలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ఎంపిక అయినా యెల్ల గంగ అనే విద్యార్థినికి అభినందనలు తెలిపి మెడల్ ను అందించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి నరేషం, ఉపాధ్యాయులు జనార్దన్, చందు ఖాన్, శైలజ, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.



