viswatelangana.com
Date of Publish : 23 April 2025, 2:07 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో వార్షిక ఫలితాల వేడుకలు

పిఎంశ్రీ జిల్లా పరిషత్ బాలికల పాఠశాల కల్లూరు రోడ్, కోరుట్లలో వార్షిక ఫలితాల వేడుకలు, తల్లితండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం అలాగే వేసవి కాలములో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు జరిగాయి. పోటీ ప్రపంచంలో విద్యార్థులను ఆకర్శించడానికి పాఠశాల బృందం చేస్తున్న కృషిని పిల్లల తల్లీ తండ్రులు ఉపాధ్యాయుల (పిటిఎ) సమావేశంలో పాల్గొని ప్రశంసించారు. వేసవిలో ఎండ వేడిమి నుంచి పిల్లలని కాపాడుకోవాలని, వడదెబ్బ తగిలినప్పుడు ఓ.ఆర్.ఎస్. తయారు చేయు విధానాము గురించి అవగాహన సదస్సులో పాల్గొన్న డా.బోగ శంకర్ వివరించారు. తదుపరి సర్టిఫికెట్ డే నిర్వహించి విద్యార్ధిని, విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ అంజమ్మ, పిటిఎ సభ్యులు పిల్లల తల్లితండ్రులు, ప్రముఖ వైద్యులు శివ సాయి హాస్పిటల్ అధినేత డా.బోగ శంకర్, మాజీ కౌన్సిలర్ తిరుమల గంగాధర్, ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ మోహన్ రావు తెలిపారు.

Change News Type