రాయికల్

జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులుగా న్యాయవాది ఆల్లె వనిత.

viswatelangana.com

March 26th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది అల్లే(పుప్పాల) వనిత గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న న్యాయ మరియు సామాజిక సేవకు గుర్తింపుగా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులుగా నియామకం అయ్యారు.జీ వో ఎం ఎస్ నెంబర్ 198 ప్రకారం వనిత ను జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర లీగల్ అఫైర్స్, లెజిస్లేటివ్ అఫైర్స్&జస్టిస్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. వనిత ఇట్టి పదవిలో రెండు సంవత్సరాలు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా అడ్వకేట్ వనిత మాట్లాడుతూ ప్రభుత్వం తనను జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యురాలుగా నియమించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజలకు న్యాయ, సామాజిక సేవలు అందివ్వడమే ద్యేయంగా పని చేస్తానని ఆమె తెలిపారు.మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన న్యాయవాది వనితను పలువురు న్యాయవాదులు, ప్రముఖులు అభినందించారు.

Related Articles

Back to top button