రాయికల్
జిల్లా విద్యాశాఖాధికారి నీ ఘనంగా సన్మానించిన ఆర్.యు.పి.పి.టి రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు

viswatelangana.com
January 24th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా విద్యాశాఖాధికారి కేలావత్ రాము నాయక్ ను రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు గా నూతనంగా ఎన్నికైన సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి ని వేల్పుల స్వామి యాదవ్ శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామివారి శాలువాతో ఘనంగా సన్మానించి మిఠాయి తినిపించారు. గత రెండు సంవత్సరాల నుండి రావాల్సిన పదవ తరగతి స్పాట్ ఎమౌంట్, బిసి కుల గణన ఎమౌంట్ ఇప్పించాలని, ఎన్నికల ఈయల్స్ గూర్చీ డి.ఈ.వో దృష్టి కి తీసుకుపోయారు. ఈ సందర్భంగా స్పాట్ ఎమౌంట్ కై రాష్ట్ర విద్యాశాఖకు వ్రాసి పంపామని, ఈయల్స్ ను ఎలక్షన్ డ్యూటీ సర్టీఫీకేట్స్ ఆధారంగా సంబంధిత డి.డి.వో లు జీవో 40 ప్రకారం మంజూరి చేయవచ్చని డిఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి చంద సత్యనారాయణ, జిల్లా శాఖ గౌరవ అధ్యక్షులు అన్యారంభట్ల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



