జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల పట్టణ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్. ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని ల్యాబ్ లో చేస్తున్న పరీక్షల గురించి, రిజిస్టర్స్ రికార్డులు పరిశీలించారు,ప్రజలకు అవసరమైనఅన్ని రకాల పరీక్షలను చేయించాలని సూచించారు.తర్వాత ఫార్మసీ రూమ్ ని పరిశీలించారు,స్టాక్ రిజిస్టర్ ని తనిఖీ చేశారు.అన్ని రకాల మందులు ఉన్నాయో లేవో అడిగితెలుసుకున్నారు. అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వచ్చేది ఎండాకాలం కాబట్టి ఎండ తీవ్రత ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సిబ్బంది అందరూ అలర్ట్ గా ఉండాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఎండ దెబ్బ తర్వాత వడదెబ్బల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఎండలో ఎక్కువగా ప్రయాణించకూడదని నీరు ఎక్కువగా తాగాలని మొదలైన జాగ్రత్తలు చెప్పాలని సూచించారు. తర్వాత అక్కడి నుండి తిప్పాయపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడి రిజిస్టర్స్ రికార్డులు పరిశీలించారు. సిబ్బంది అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పడకుండాప్రజలకుఅవగాహన కల్పించాలన్నారు. తర్వాత నమిలకొండలో నిర్మిస్తున్న నూతన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి పిల్లలందరికీ సరైన సమయంలో టీకాలను వేయించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా. వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా ఇమేజెస్ అధికారి డాక్టర్ శ్రీనివాస్, మండల వైద్యాధికారులు డాక్టర్ పరమేశ్వరి డాక్టర్ నరేష్, డిపిఓ రవీందర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వి. రాజశేఖర్. సిబ్బంది పాల్గొన్నారు.



