నిజామాబాద్మెట్ పల్లి
జిల్లా స్థాయి అబాకస్ పోటీలో మెట్ పల్లి అక్షర స్కూల్ విద్యార్థుల ప్రతిభ

viswatelangana.com
February 17th, 2024
నిజామాబాద్ (విశ్వతెలంగాణ) :
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
నిజామాబాద్ లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా స్థాయి అబాకస్ పోటీలు జరుగగా ఈ పోటీలలో జిల్లా స్థాయి నుండి దాదాపు 250 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ అబాకస్ పోటీలలో జగిత్యాల జిల్లా మెట్ పల్లి బస్ డిపో దగ్గర గల అక్షర హై స్కూల్ నుండి రాపాని సిద్దార్థ్ జిల్లాస్థాయిలో మొదటి బహు మతి సాధించి రాష్ట్ర స్థాయి లో జరిగే పోటీలకు ఎంపికయ్యాడు మరియు గోల్కొండ వేదశ్రీ, వడ్డేల స్పందనలు ప్రోత్సాహక బహుమతులు పొందారు.ఈ కార్యక్రమంలో అక్షర స్కూల్ కరస్పాండెంట్ శ్రీ కొత్తూరు శ్రీనివాస్, ప్రిన్సిపాల్ గాదె మల్లికార్జున్ , వసుధ ,శివ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



