రాయికల్

జి.ఎం.ఆర్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రంలో సి.పి.ఆర్ శిక్షణ

viswatelangana.com

March 26th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ కేంద్రంలోని చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ భవనంలో జి.ఎం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, ప్రతిమ ఫౌండేషన్ సమన్వయంతో టైలరింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు మంగళవారం నగునూర్ లోని ప్రతిమ ఆసుపత్రి వైద్యులు హృదయశ్వాసకోశ పునరుజ్జీవనం (సి.పి.ఆర్) కు సంబంధించిన అవగాహన కల్పించడం జరిగింది. ఈసందర్భంగా డా.కార్తీక్ మాట్లాడుతూ అనుకోని సంఘటనలు, ప్రమాదం సంభవించినప్పుడు నాడీ పనిచేయకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్షతగాత్రులకు, గుండెపోటు బారిన పడిన వ్యక్తులకు తక్షణ హృదయాశ్వాసకోశ పునరుజ్జీవన చర్య ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడవచ్చన్నారు. అనంతరంశిక్షణ పొందుతున్న యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిమ ఫౌండేషన్ మేనేజర్లు కౌశిక్, గీతారెడ్డి, టెక్నీషియన్ లు రాజేందర్, లక్ష్మణ్ సిబ్బందివిరాట్, రఘుపతి, శ్యామల, వర్దిని జిఎంఆర్ సిబ్బంది ప్రమోద్, నాగేష్, చిరంజీవి, కృష్ణవేణి, టైలరింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కోర్సులలో శిక్షణ పొందుతున్న యువతీ, యువకులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button