జీఓ 25 ను రద్దు చేసి తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలి.
కోరుట్ల ఉపాధ్యాయ జేఏసి ఆధ్వర్యంలో నిరసన.

viswatelangana.com
శుక్రవారం రోజున జెడ్పి హెచ్ యస్ కోరుట్ల స్కూల్ కాంప్లెక్స్ సమావేశ అనంతరం ప్రభుత్వం అనాలోచిత, అసంబద్ధంమైన జీఓ 25 ను రద్దు చేసి, తరగతి కి ఒక ఉపాధ్యాయుని నియమించాలని, ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ డిఏ బకాయిలు, పీఆర్సీ ను వెంటనే దసరా పండుగ కానుకగా ప్రకటించాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పోస్ట్ మంజూరు చేసి వెంటనే బి.ఈ. డి అర్హత కలిగిన ఉపాధ్యాయులతో నియమించాలని, కంట్రిబ్యూటరి, పెన్షన్, స్కీమ్ ను వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ స్కీమ్ ఇవ్వాలని, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు యం.యల్.సి ఓటు హక్కు ఇవ్వాలని కోరుతూ ప్లే కార్డ్స్ తో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నునవత్ రాజు తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం టీ. జీ. యు. ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎస్సి, ఎస్టీ ఉపాద్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు నకుమల్ల నర్సయ్య, అంకం దామోదర్ పీ.ఆర్.టీ.యు రాష్ట్ర కార్యదర్శి , శివరామ కృష్ణ తపస్, అనిల్ యు టీ ఆఫ్, చమకూరి శ్రీనివాస్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.



