జగిత్యాల

చెవి నొప్పి అని వెళితే చెవులు పిండిన ప్రభుత్వ ఆసుపత్రి

ఏం చేసినా చెల్లుతుంది అంటున్న ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు

viswatelangana.com

October 26th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా దవాఖానాలో ఇలా ఉంటే మరి ఇతర మండల దవాఖానాలో పరిస్థితి మరీ దారుణం కానరాని సిబ్బంది రిజిస్టర్ లో పేరు రాసి వెళ్లిపోతున్న మరికొందరు అడిగే వాళ్ళు లేక కొంతమంది ప్రైవేట్ గా ప్రాక్టీస్ పెట్టు కొన్నారంటూ వినికిడి వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో పని చేసే డాక్టర్లు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు పోతున్నారు తెలియడం లేదని అంటున్న బాధితులు విషయానికి వస్తే చెవి నొప్పి అంటూ ఒక బాధితుడు గవర్నమెంట్ దవాఖానా కు ఒంటి గంట సమయానికి వెళ్ళాడు ఓపి కొరకు కౌంటర్ వద్ద అడగగా టైం అయిపోయిందని అనడంతో లేదు రెండు గంటల వరకు ఉంది కదా అని అనడంతో దురుసుగా మాట్లాడుతూ నీ ఇష్టం ఈరోజు టైం అయిపోయింది వస్తే సోమవారంరా లేకపోతే లేదు అనడంతో సంబంధిత హాస్పిటల్ సూపరింటెండెంట్ తో ఫోన్ మాట్లాడగా ఓపి ఇవ్వండి అని చెప్పడంతో ఎవరైతే కంప్లైంట్ చేశారో అతనికి ఇవ్వకుండా మిగతా వారికి ఇచ్చి టైం అయిపోయింది సోమవారం రోజు రమ్మంటూ దురుసుగా మాట్లాడారు. ఇది మొదటిసారి కాదని ఇక్కడ ఏ డాక్టర్ ఎప్పుడు వస్తాడో తెలియదని అక్కడ ఉన్న బాధితులు అంటున్నారు ఇలా జరగకుండా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు

Related Articles

Back to top button