చెరువులు కుంటలు వాగు పరివాహక ప్రాంతాన్ని రక్షించి గంగపుత్రులను అదుకోవాలి
_ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్

viswatelangana.com
చెరువులను కుంటలను వాగు పరివాహక ప్రాంతాన్ని రక్షించాలని వాటిపై ఆదారపడి జీవిస్తున్న గంగపుత్రుల జీవనోపాధి పై దెబ్బ తీసేలా శిఖం భూముల్లో కబ్జాలకు పాల్పడిన ఎంతటి వారినైనా శిక్షించాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ డిమాండ్ చేసారు. మంగళవారం కోరుట్లలోని తాళ్లచెరువును కోరుట్ల డెవలప్మెంట్ ఫోరమ్ అధ్యక్షులు చెన్న విశ్వనాథంతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా పేట భాస్కర్, చెన్న విశ్వనాథంలు మాట్లాడుతూ… పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే మంచి నీటి సరస్సుగా ప్రసిద్ధి గాంచిన తాళ్ల చెరువును చిన్నబిన్నం చేశారని ఆరువై ఎకరాల చెరువును ఇరువైఐదు ఎకరాలకు తీసుకవచ్చారని ఆక్రమ నిర్మాణాలతో గంగపుత్రుల జీవనోపాధికి భంగం వాటిల్లిందని ప్రజలు భూములు కోనుగోలు చేసేటప్పుడు ఎలాంటి భూమో తెలుసుకోవాలని శిఖం, ఎఫ్టిఎల్, బఫార్ జోన్, వాగు పరివాహక, వ్యవసాయ, ప్రభుత్వ భూముల అని తెలుసుకున్నకే కోనుగోలు చేయాలని లేకపోతే ఆక్రమ నిర్మాణాల వల్ల ఇలాంటి వరదల ఇబ్బందులు తప్పవన్నారు. ఈవిషయంలో చెరువుల రక్షణకై హైడ్రా తరహా చట్టం పట్టణంలో అమలు చేయాలని కోరుతూ కోరుట్ల ఆర్డీవో సూపరింటెండెంట్ ముత్యాల శ్రీనివాస్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ నాయకులు చింత భూమేశ్వర్, యెన్నం రాధ, షాహేద్ మహ్మద్ షేక్, నియోజకవర్గ పిసర్మేన్ అధ్యక్షులు ఇట్యాల రాజేందర్, గంగపుత్ర సంఘం నాయకులు ఇల్లుటపు గంగానర్సయ్య, జుంబర్తి రమేష్, కుట్టాల లక్ష్మీ నారాయణ, సిరికొండ రాము, పల్లికొండ ప్రవీణ్, జుంబర్తి రాము, దేశవేని మోహన్, పందిరి శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.



