రాయికల్
అనాధాశ్రమానికి చేయూతను అందించిన శ్రీ గ్రీన్ వుడ్ హై స్కూల్

viswatelangana.com
January 29th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
ఒకరికి సహాయం చేస్తే ఆ సహాయం మళ్ళీ మనకు తిరిగి చేరుతుందనేమో అనుకున్నారేమో ఆ స్కూలు పిల్లలంతా కలిసి ఒక్కొక్క రూపాయి పోగు చేసి తల్లి తండ్రులేని అనాధ పిల్లలకు ఆర్థిక సహాయం అందించారు. రాయికల్ మండల కేంద్రంలోని శ్రీ గ్రీన్వుడ్ పాఠశాలకు చెందిన మూడవ తరగతి నుండి 8వ తరగతికి చెందిన విద్యార్థులు అందరూ ఒక్కటిగా ఏకమై మొత్తం 16,100 రూపాయలు గోదావరిఖని ప్రాంతానికి చెందిన ఎండి హెచ్ డబ్ల్యు ఎస్ అర్ఫన్స్ హోమ్ అనాధ పిల్లల ఆశ్రమానికి అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ మిట్టపల్లి మహేష్ రెడ్డి, డైరెక్టర్ కాకర శ్రీనివాస్ రెడ్డి, హెడ్మాస్టర్ రాజేష్, ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని, పిల్లలు పాల్గొన్నారు.



