రాయికల్
ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో నగర సంకీర్తన

viswatelangana.com
June 14th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ బస్తీ (ఇందిరా నగర్ )కాలనీ లో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమం చేయడం జరిగింది. ధర్మ జాగరణ సమితి కార్యకర్త తిరుకోవెల సురేందర్ మాట్లాడుతూ హిందూధర్మం భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. హిందూ ధర్మం అతి పురాతన సంస్కృతి. దీనినే ‘సనాతన ధర్మం’ అని కూడా వ్యవహరించడం జరుగుతుంది.ధర్మం అనగా ఆచరణీయ కార్యం. మతమనగా అభిప్రాయo.కానీ ఇప్పుడు మన బంధువులు కొందరు మన ధర్మాన్ని, మన తల్లిలాంటి మతాన్ని వదిలి ప్రలోబాలకులోనై మతం మారుతున్నారు. ఇప్పటికైనా మన హిందువులు ఐకమత్యంతో మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి అని అన్నారు. ఇందులో సమితి సభ్యులు శొంఠిగికర్ రాము, సంయోజక్ సుతారి రాజేష్, సహా సంయోజక్ కిషన్, అర్చకులు రాజేష్, కుర్మ మల్లారెడ్డి, నారాయణ, జ్యోత్స్న, శ్రీతన్య, రిషి మరియు బస్తీ వాసులు పాల్గొన్నారు..



