క్రమశిక్షణ గల విద్యార్థులు ఏదైనా సాధిస్తారు సీఐ నిరంజన్ రెడ్డి

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలకేంద్రంలోని కళాధర పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలను సీఐ నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. 2025 సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ గల విద్యార్థులు జీవితంలో ఏదైనా సాధిస్తారని, క్రమశిక్షణ తో కూడిన విద్య అవసరమని అన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల చైర్మన్ గడ్డం భూమారెడ్డి, డైరెక్టర్ దివాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ కమలాకర్, మాజీ జెడ్పిటీసి నాగం భూమయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కాయితి నాగరాజు, మాజీ వైస్ ఎంపిపి కిరణ్ రావు, నాంపెల్లి లింబాద్రి, మాజీ సర్పంచ్ ఎంజీ రెడ్డి, మాజీ ఎంపిటిసి బొడ్డు బాలు, గాండ్ల స్వామి, బైర మల్లేశం, పిడుగు తిరుపతి రెడ్డి, దొప్పల జలంధర్, కల్లెడ శంకర్, గుండారపు గంగాధర్, గడ్డం స్వామి రెడ్డి, తుమ్మనపెల్లి మహేష్, బత్తిని నవీన్, బత్తిని శ్రీను,రమేష్ తదితరులు పాల్గొన్నారు



