కథలాపూర్
భూసార పరీక్షలపై అవగాహన
viswatelangana.com
February 19th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
పొలంలో ఆరోగ్యకరమైన పంట పండాలంటే ఆ నేల కూడా ఆరోగ్యంగా ఉండాల్సిందే. భూసారాన్ని పెంచాలంటే ముందు దానికి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. భూసార పరీక్షలపై సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు వామన, తరుణ్, ప్రిముల్ తేజ, శ్రీహర్ష, ప్రశాంత్ లు కథలాపూర్ గ్రామంలో రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.



