viswatelangana.com
Date of Publish : 11 April 2025, 2:21 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
జ్యోతిభా పూలే ఆశయ సాధనకి యువత ఉద్యమించాలి

సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త మహత్మ జ్యోతిభాపూలే ఆశయాల సాధనకై నేటి యువత ఉద్యమించాలని బి.సి యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శికారి గోపికృష్ణ స్థానిక పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ పి.జీ కళాశాలలో జయతి ఉత్సవాలను ఉద్దేశించి పిలుపు నిచ్చారు. శుక్రవారం మహాత్మ జ్యోతిభాపూలే జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమంను ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యా వికాసం వర్థిల్లాలని, సాంఘీక దురాచారాలకు వ్యతిరేకంగా సమ సమాజ స్థాపన కోసం తన జీవిత కాలం ఎనలేని కృషి చేసిన మహానీ యులు మహాత్మ జ్యోతిభాపూలే అని కొనియాడారు. ఆడ పిల్లల విద్యాభ్యాసం కోసం వారి సతీమణి సావిత్రి భాయి పూలేను ఈ దేశానికి మొట్ట మొదటి మహిళా ఉపాధ్యా యురాలుగా అందించిన మహోన్నత మూర్తి పూలే అని గుర్తు చేశారు. పట్టణములో జ్యోతిభాపూలే సావిత్రి భాయ్ పూలే పుణ్య దంపతుల విగ్రహ ఏర్పాటుకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో బి.సి యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తుమ్మనపెల్లి రాజేంద్రప్రసాద్, రామకృష్ణ డిగ్రీ, పి.జి సంయుక్త కళాశాలల ప్రిన్సిపాల్ బెజ్జారవు ప్రవీణ్ కుమార్, రాజు, రాజ్ కుమార్, నవీన్, సాయిరాం, నాగభూషణ్, నరేందర్, మహేష్, శ్రీనివాస్, గణేష్, గంగా లక్ష్మి, భార్గవి, ఆసిమా, రాజమణి, సుప్రియ, తదితరులు పాల్గొన్నారు.

Change News Type