కోరుట్ల
వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జువ్వాడి నర్సింగ్ రావు

viswatelangana.com
September 4th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బీర్ నంది నర్సింహ చారి ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామి వారి శేష వస్త్రాన్ని కప్పి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, ఉపాధ్యక్షులు నయీమ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పుప్పాల ప్రభాకర్, సంగ లింగం, కరుణాకర్ రావు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



