రాజన్న సిరిసిల్ల
ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక

viswatelangana.com
August 20th, 2024
రాజన్న సిరిసిల్ల (విశ్వతెలంగాణ) :
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఎస్ఐ అల్లం రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం వాహన తనిఖీలు నిర్వహించారు. సైలెన్సర్లు మార్చి అధికశబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న పలువురు వాహనదారులకు జరిమానాలు విధించారు. మాడిఫైడ్ సైలెన్సర్స్ తొలగించారు. వాహనదారులందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, లేనియెడల చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఐ హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఎస్ఐ తెలిపారు