కథలాపూర్
మోడల్ స్కూల్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలు

viswatelangana.com
October 1st, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మంగళవారం తొలివిడత బతుకమ్మ, దసరా వేడుకలు నిర్వహించారు. విద్యార్థిని, విద్యార్థులు వివిధ రకాల పూలను సేకరించి బతుకమ్మలను తయారు చేసి బతుకమ్మ ఆటలు ఆడారు. విద్యార్థినిలతో పాటు అధ్యాపకులు అందరూ కలిసి ఆటలాడారు. ఆ తర్వాత స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



