కోరుట్ల డిపో పరిధిలోని పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలు డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్ తెలిపినారు. డిపో మేనేజర్ మనోహర్ గారు మాట్లాడుతూ 2025 మార్చి 15(శనివారం) ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని.. కావున కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలు 8374534961 ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి సలహాలు సూచనలు సమస్యలను తెలపాలని డిపో మేనేజర్ ప్రకటనలో తెలిపారు.