viswatelangana.com
Date of Publish : 02 July 2024, 4:27 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
డాక్టర్ ఈదుల లక్ష్మణ్ కు బుద్ధ పౌర్ణిమ జాతి అవార్డు పొందిన సందర్భంగా గ్రామ పెద్దల అభినందన

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వడ్డే లింగాపూర్ గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు ఈదుల లక్ష్మణ్ కుమార్ మానవసేవే మాధవసేవా అని మార్గంలో నడుస్తూ అనేక ప్రైవేటు వైద్యుల సహకారం మారుమూల ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి నీరుపేదల ఆరోగ్య అభివృద్ధికి తోడ్పడ్డారు కరోనా సమయంలో భయపడకుండా మారుమూల గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించారు తగిన సలహాలు ఇస్తు గ్రామీణ ప్రాంతాలలో విశిష్టమైన సేవలను పేద ప్రజలకు అందించినందుకు గాను గుర్తించి కరీంనగర్ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి జయంతి ఉత్సవాలు 2024 సందర్భంగా జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తెలుగు వెలుగు సాహితి వేదిక స్వచ్చంద సేవా సంస్థ జాతీయ చైర్మన్ పోలోజు రాజ్ కుమార్, ప్రముఖ హాస్య నటుడు నంద శాంతి కృష్ణ గారు గ్రామీణ వైద్య రంగంలో లక్ష్మణ్ చేసిన సేవలను గుర్తించి అవార్డు గ్రహీతగా ఎంపిక చేసి కరీంనగర్ లో జరిగిన పీవీ నరసింహారావు జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన కు గౌతమ బుద్ధ పూర్ణిమ అవార్డును ప్రధానం చేశారు అవార్డు పొంది ఒడ్డెలింగాపూర్ గ్రామాన్ని జాతీయ స్థాయిలో తెలిసేల చేసిన లక్ష్మణ్ కుమార్ ని పలువురు గ్రామ పెద్దలు సన్మానించారు కార్యక్రమంలో సామాజిక జానపద రచయిత గాయకుడు మరియు జిల్లా దిశా కమిటీ సభ్యులు భూక్య గంగాధర్ నాయక్ సర్పంచ్ పాలకుర్తి రవి బండారి సాయిరాజ్ గౌడ్ మారంపల్లి రమేష్ బాణావత్ రమేష్ బోదాసు జలపతి సురేందర్ నరసమ్మ తదితరులు పాల్గొన్నారు

Change News Type