ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అసభ్య కరమైన పోస్టులు చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తెలుసుకోవాలి

viswatelangana.com
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొందరు బిఆర్ఎస్ నాయకులు ట్విట్టర్ వేదికగా అవమానకరమైన ప్రకటనలు మరియు చిత్రాలను మార్ఫింగ్ చేయడం, నకిలీ వీడియోలు సృష్టించి ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా అవమానం చేస్తూ ట్విట్టర్ లో కొందరు నాయకులు కక్షపూర్వకంగా వ్యక్తిగతంగా అవమణిస్తూ పోస్ట్లు పెడుతున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని అలాగే సోషల్ మీడియాలో ప్రభుత్వాని అలాగే ముఖ్యమంత్రిపై అభ్యతకరమైన పోస్ట్లు చేస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరుట్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడం జరిగింది. ఈకార్యక్రమంలో ఎన్.ఎస్.యు.ఐ. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షులు బిరుకుల విజయ్ పటేల్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కటుకం చంద్రశేఖర్, కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కడకుంట్ల గంగాధర్, ఎన్.ఎస్.యు.ఐ. జిల్లా ఉపాధ్యక్షులు పోల్కం శివ , ఎన్.ఎస్.యు.ఐ. ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ కేద్దార్ మరియు తదితరులు పలుగొన్నారు.



