కొడిమ్యాల

విద్యార్థులను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచండిజిల్లావిద్యాధికారి రాము

viswatelangana.com

March 23rd, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

విద్యార్థులను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచాలని విద్యార్థుల తల్లిదండ్రులకు జిల్లా విద్యాధికారి రాము విజ్ఞప్తి చేశారు కొడిమ్యల మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రామ్ సాగర్ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా విద్యాధికారి రాము మాట్లాడుతూ విద్యార్థులను పాఠశాల అనంతరం సెల్ ఫోన్ లకు టీవీలకు దూరంగా ఉంచి పాఠ్య పుస్తకాల పఠనం వైపు విద్యార్థుల దృష్టి మళ్లించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు ఆటపాటలతో విద్యాభ్యాసం కొనసాగించాలని వారన్నారు పీఎం శ్రీ కార్యక్రమాల వల్ల ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహించడం వల్ల విద్యార్థుల ప్రభుత్వ పాఠశాల వైపు ఆకర్షితులు అవుతారని అన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన ఉపాధ్యాయులను జిల్లా విద్యాధికారి అభినందించారు అనంతరం పిఎంశ్రీ ఫ్రీప్రైమరీ తరగతిగది ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ వనిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ సభ్యులు జగన్మోహన్ రెడ్డి పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ఆనంద్ రావు యాల్ల అమర్నాథ్ రెడ్డి అంజయ్య చక్రధర్ విజయరావు దేవరాజు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Related Articles

Back to top button