కోరుట్ల
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళి

viswatelangana.com
April 5th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముజాహిద్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మొహమ్మద్ ముజాహిద్ మాట్లాడుతూ… డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సమానత్వం, న్యాయం అలాగే బహిష్కృత వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది, మనం కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని మొహమ్మద్ ముజాహిద్ హితావు చేశారు.



