రాయికల్
సహకార అవగహన ర్యాలీ

viswatelangana.com
April 17th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని రాయికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అవగాహన ర్యాలీని గురువారం రోజున సంఘ నూతన కార్యాలయం నుండి బస్టాండ్ వరకు నిర్వహించారు.ఈ సందర్బంగా సంఘ అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి మాట్లాడుతూ రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్బంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమలను వివరించారు. ఈ కార్యక్రమంలో సహకార అడిట్ అధికారి సత్యనారాయణ, సహకార శాఖ నోడల్ అధికారి సాయికుమార్ గౌడ్, మరియు జిల్లా సహకార శాఖ సిబ్బంది, సంఘ ఉపాధ్యక్షులు బేతి మోహన్ రెడ్డి సంఘ డైరెక్టర్లు కుర్మ రాము, కైరం రమణ, కోల్ల నారాయణ, బోడ భూమరాజం, ఇంచార్జి సీఈఓ కటుకం జగదీశ్ సంఘ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.



