viswatelangana.com
Date of Publish : 14 April 2024, 3:46 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంస్కరణలకు అధ్యుడు
featured

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంస్కరణలకు ఆధ్యుడని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు కొంపెల్లి లక్ష్మణ్, ముక్కెర నరేష్ లు పేర్కొన్నారు. ఆదివారం రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని అన్నారు. ప్రపంచంలో గొప్ప రాజ్యాంగాన్ని రచించి ప్రజల అవసరాలు హక్కులను తెలిపిన మహానాయకుడని, వారికి రిజర్వేషన్లు హక్కులు కల్పించడమే కాదు విధులను కూడా సూచించాడని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరికి ఎంత రిజర్వేషన్లు ఉండాలని,ఎంత వేతనాలు తీసుకోవాలో సమాజంలో ఎలా నడుచుకోవాలో రాజ్యాంగంలో క్లుప్తంగా వివరించారని కొనియాడారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి జయంతిని జరుపుకోవడం మా పూర్వ జన్మలో చేసిన పుణ్య ఫలమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మాజీ తాజా సర్పంచ్ నీలి మల్లయ్య, నాయకులు దిండిగాల రామస్వామి, కిషన్ రావు, ఎనుగందుల రమేష్, మహబూబ్, దుంపల నర్సారెడ్డి, సోమ వెంకటేష్, మహిపాల్, శనగరపు ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్ కనికరపు లక్ష్మణ్, అంబేద్కర్ సంఘ నాయకులు గాజం నర్సయ్య, బిట్రగు దశరథం, నల్ల వినోద్, ఇంద్రాల నిశాంత్, రాఘవేంద్ర, బిట్రుగు అనుపాల్, బైరి భూమరాజం తదితరులు పాల్గొన్నారు.

Change News Type