రాయికల్
ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో భారతమాత పూజోత్సవం

viswatelangana.com
January 25th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో భరతమాత పూజా కార్యక్రమం శనివారం రోజున నిర్వహించారు. ఈ సందర్బంగా ధర్మజాగరణ ప్రముఖ్ సురేందర్ మాట్లాడుతూ మన హిందూ సంస్కృతి సంప్రదాయాలను ధర్మజాగరణ ద్వారా జాగృతం చేసి సనాతన ధర్మాన్ని కాపాడాలని వారు అన్నారు. హిందువులలో చైతన్యం నింపేందుకే గ్రామ గ్రామాన భారతమాత హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో తిరుమల గంగారెడ్డి, భోగ హరి కృష్ణ, కొమురవెళ్లి శరత్, భోగ సంతోష్, పొట్టవత్తిని గంగాధర్, ఆడెపు నరేందర్, ఏనుగంటి నవీన్, ఆడెపు మధుకృష్ణ, వంగరి రమేష్, పూదరి శ్రీనివాస్, తిరుమల శంకర్, జోగినిపెల్లి తిరుపతి గౌడ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



