భీమారం
డ్రం సీడర్ పద్ధతిలో వరి వేయడం.

viswatelangana.com
July 2nd, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
బుధవారం భీమారం మండలం రాఘోజీపేట గ్రామంలో డ్రం సీడర్ పద్ధతిలో రైతు బాలుసాని సుశీల, పొన్నం తిరుమల పొలంలో మూడు ఎకరాలు వరి వేయడం జరిగింది. వ్యవసాయ విస్తరణ అధికారి సాయిప్రియ మాట్లాడుతూ డ్రం సీడర్ పద్ధతి ద్వారా సరైన సమయంలో కలుపు యాజమాన్యం పాటిస్తే కూలీల సమస్యను అధిగమించవచ్చు. పది రోజుల ముందుగా పంట చేతికి వస్తుంది. ఈ పద్ధతి ద్వారా ఎకరాకు కనీసం ఆరు వేల వరకు ఆదా చేసుకోవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మారుతి, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.



