విద్యార్థులు కష్టపడి చదివిఉన్నత శిఖరాలను అధిరోహించాలి.బి.నారాయణ. తెలిపారు

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోనివిద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి ఉన్నతశిఖరాలను అధిరోహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బి. నారాయణ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంవత్సర వీడ్కోలు పార్టీ ఘనంగానిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితంలో వచ్చే చిన్నచిన్నసమస్యలను భరించి, వార్షిక పరీక్షలు మంచిగా రాసి మిమ్మల్ని చదివించిన,మీతల్లిదండ్రులకు గొప్ప కానుకగా మీ విజయం ఉండాలని సూచించారు. అలాగే పాఠశాలలో బోధించిన టీచర్లకు, కళాశాలకు మంచి పేరు తీసుకోని రావాలన్నారు. ప్రిన్సిపాల్ అసోసియేషన్ అధ్యక్షులు వై.రమేష్బాబు. ప్రతి ఒక్కరూఎదుగుదలకు, ఉన్నతస్థానాలకు ఎదగడానికి మంచి ఉద్యోగాలు చేయడానికి, ఏ రంగంలో అయినా సాధించడానికి చదివే ప్రాధాన్యతమని, ప్రతి ఒక్క విద్యార్థి అది దృష్టిలో ఉంచుకొని బాగాచదువుకొని గొప్పమార్కులుసాధించుకోవాలని అన్నారు. కళాశాల మాజీప్రిన్సిపాల్కె. వెంకటేశ్వర్లు. విద్యార్థులు సరైన ప్రణాళికతో చదువుతే పరీక్షలలో విజయం సాధిస్తారు అన్నారుస్థానిక ఎస్సై ఎస్. సందీప్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు భవిష్యత్తులో తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఈసందర్భంగా గత వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యాధికారి స్వంతగా పారితోషికం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె. వేణు, అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.



