viswatelangana.com
Date of Publish : 15 April 2025, 1:34 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
తనిఖీలు.. జరిమానాలు

మున్సిపల్ ప్రత్యేక అధికారి బి. ఎస్ లత అదనపు కలెక్టర్ జగిత్యాల ఆదేశాల మేరకు అలాగే మున్సిపల్ కమీషనర్ ఏ. మారుతి ప్రసాద్ ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలోని హోటళ్లు, రెస్టా రెంట్లు, చికెన్ సెంటర్లు, ఆర్డర్ మెస్లలో పరిశుభ్రత, నిషేధిత ప్లాస్టిక్ వాడకంపై పుర అధికారులు తనిఖీ చేపట్టారు. తాజా ఆహారాన్ని మాత్రమే వినియోగదారులకు అందించాలని సూచించారు. నిలువ ఉంచిన ఆహారం అలాగే సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడుతున్న రెస్టారెంట్ మరియు షాప్ లు అకస్మిక తనిఖీలు నిర్వహించి వారు వినియోగిస్తున్న సింగల్ యూస్ ప్లాస్టిక్ ను స్వాధీనం పరుచుకొని సుమారుగా 12000 రూపాయలు జరిమానాలు విధించడంతో పాటు బట్ట సంచులు వాడాలని తెలిపారు. దీనిని ఉదేశించి మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిస్థాయిలో నిషేదించాలి లేనియెడల భారీ జరిమానాలు విధించడంతో పాటు దుకాణాలు సీజ్ చేయడం జరుగుతుంది అని ఆయన తెలపడం జరిగింది. వ్యాపార కార్యకలాపాలతో వెలువడిన చెత్తను తడి, పొడి, హానికరక చెత్తగా వేరు చేసి షాప్ వద్దకు వచ్చే మున్సిపల్ వాహనాలకు అందించాలని తెలిపారు. లేనిచో ఎస్డబ్ల్యుఎం-2019 చట్టం ప్రకారం జరిమానా విధించబడుతుందాన్నారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ బాలే అశోక్, జగదీష్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ జి.మహేష్, మున్సిపల్ సిబ్బంది అలాగే జవాన్లు పాల్గొన్నారు.

Change News Type